హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్తంభించిపోయిన రాకపోకలు

ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు-విస్సన్నపేట మధ్య ఉన్న కుమ్మరికుంట్ల బ్రిడ్జి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరద ప్రవాహం వల్ల పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కోరారు.