MNCL: మందమర్రి పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సింగరేణి సిద్ధి వినాయక మండపంలో గురువారం గణపతి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో పట్టణానికి చెందిన రావికంటి వెంకటేశం రూ.1,00,116కు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై లడ్డూను లబ్ధిదారుడికి అందజేసి, అభినందించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశించారు.
తెలంగాణ
VIDEO: గణపతి లడ్డూ వేలంలో మంత్రి


