ప్రకాశం: ఎలినినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ప్రకాశం భవన్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటల సాగు, తాగు-సాగునీరు, పశుగ్రాసం, వర్షపాతం వివరాలను ప్రతిరోజూ సేకరించి అందుబాటులో ఉంచాలన్నారు. శాఖల మధ్య సమన్వయం పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినోపై అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు


