హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలపై పనబాక లక్ష్మి ఫైర్

TPT: జిల్లాలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డా. పనబాక లక్ష్మి ఆరోపించారు. తిరుపతి హీరో హోండా షోరూమ్ వద్ద అండర్ బ్రిడ్జిని పరిశీలించిన ఆమె.. ప్రజా సమస్యలపై అనవసర ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.