హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వరహాల గెడ్డ కాజ్‌వేను పునర్మించాలి'

SKLM: ఆర్నబ్ వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా కంబిరిగాం వరహాలగెడ్డపై ఉన్న కాజ్‌వేపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోందని సీపీఐ నాయకులు చాపర సుందర్‌లాల్, లండ వెంకట్రావు తెలిపారు. దీంతో పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి కాజ్‌వేను పునర్నిర్మించాలన్నారు.