హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ'

KDP: జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ కుళ్లాయిబాబు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు ఎన్డీడీ పోస్టర్‌ను ఎంపీడీఓ కుళ్లాయిబాబు, డాక్టర్ రాఘవేంద్ర ఆవిష్కరించారు. రేపు 1 నుంచి 19 ఏళ్ల పిల్లలు, కిశోర బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.