ASR: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు డుంబ్రిగూడ మండలం రంగిలిసింగి పంచాయతీ కింజెరు గ్రామానికి చెందిన పాంగి లచ్చన్న నివాస గృహం ఒకవైపు గోడ దెబ్బతింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని లచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వర్ష బీభత్సానికి దెబ్బతిన్న ఇల్లు


