హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వర్షపు నీరు

SKLM: వర్షాలతో టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. పాత భవనం పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో రికార్డు రూమ్‌లోని కీలక పత్రాల భద్రతపై ఆందోళన నెలకొంది. కార్యాలయ ప్రాంగణం కూడా జలమయం కావడంతో రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.