హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నీటిని తొలగించిన స్థానికులు

ASR: అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అరకులోయ పబ్లిక్ స్కూల్ సమీపంలోని వంతెన వద్ద నీరు నిలిచిపోయింది. దీంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను గుర్తించిన స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వంతెన వద్ద నీరు గెడ్డలోకి వెళ్లేలా అడ్డుగా ఉన్న తుప్పలు, మట్టిని తొలగించారు. దీంతో నీటి ప్రవాహానికి మార్గం సుగమమైంది.