హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాజ్‌వేపై రాకపోకలు బంద్

VZM: భారీ వర్షాల నేపథ్యంలో గరివిడి మండలం విపిరేగ కాజ్‌వేను జేసీ ఎస్. సేధు మాధవన్ గురువారం పరిశీలించారు. చిట్టిగెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో కాజ్‌వేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ మేరకు తాత్కాలికంగా కాజ్‌వేపై రాకపోకలను నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బంగార్రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.