హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిండిన చెరువులు.. రైతులు హర్షం

E.G: వాయుగుండంతో పడుతున్న వర్షాలు పంటలకు ఎంతో మేలు చేస్తాయని, నీరు సమృద్ధిగా అందుతుందని రంగంపేట రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మండలంలో గురువారం ఉదయానికి 138 మి.మీ వర్షపాతం నమోదైంది. 200 ఎకరాల నల్లచెరువు సహా 11 PWD చెరువులకు జలకళ వచ్చింది. చెరువులు నిండిన మిగులు నీరు వెంకటాపురం, దొడ్డిగుంట, సింగంపల్లి మీదుగా బిక్కవోలు కాలువలోకి చేరుతోంది.