హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలిపే లక్ష్యంగా పనిచేయాలి

AKP: నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద గురువారం కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి ఘన విజయం సాధించాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.