హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పథకం పురోగతి, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, అమలు ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.