ప్రకాశం: కనిగిరి (మం) కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, శిశువులు, కిశోర బాలికలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు తీసుకోవడంపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపల్లిలో జాతీయ పోషణ మాసం అవగాహన


