హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ ఛైర్మన్లతో మంత్రి సవిత భేటీ

సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, మల్లెల ఈశ్వర్, వెంకటరమణ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలతో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.