హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25న నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

PLD: రొంపిచర్ల మండలంలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఎన్. సాయిబాబా తెలిపారు. 1–19 ఏళ్ల వయస్సు గల 6,448 మంది పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు అందజేస్తామన్నారు. మాత్రలు తీసుకోని వారికి అక్టోబర్ 5న మాప్‌అప్ డే నిర్వహించనున్నారు.