హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డు స్థాయిలో లడ్డూ వేలం

అన్నమయ్య: రాయచోటి‌లోని ఎమ్మెస్సార్ కాలనీలో వినాయకుడి లడ్డూ వేలం రికార్డు స్థాయిలో జరిగింది. మారగాని సాయి యాదవ్ రూ. 9 లక్షలకు లడ్డూను, మడితాటి శ్రీనివాసులు రెడ్డి రూ. 2 లక్షలకు కలశాన్ని దక్కించుకున్నారు. అనంతరం బ్యాండ్ బాజాలు, బాణాసంచా, కోలాటాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. వేలంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పోటీపడ్డారు.