హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు ‘ఫ్లాష్‌ఫ్లడ్’ ముప్పు

KKD: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్ష బీభత్సం కొనసాగుతోంది. జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘ఫ్లాష్‌ఫ్లడ్’ ముప్పు పొంచి ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఉదయం 11:30 గంటల వరకు పలు లోతట్టు ప్రాంతాలు, వాగులు ఆకస్మిక వరద నీటితో పోటెత్తే అవకాశముందని హెచ్చరించింది. జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.