హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల పట్టివేత

NDL: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం 3 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. జమ్మలమడుగు నుంచి కొలిమిగుండ్లకు అక్రమంగా ఇసుకను తరలించి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వివరించారు. నిందితులైన ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.