హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. దంపతుల ఆత్మహత్య

KDP: ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుమారుడికి ఉద్యోగం రాలేదనే ఆందోళనతో భర్త మోహన్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కడప రైల్వే స్టేషన్‌లో మోహన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలిసి మనస్తాపానికి గురైన భార్య భారతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.