హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పమిడిముక్కలలో 25 డీవార్మింగ్ డే..!

కృష్ణా: పమిడిముక్కలలో ఈనెల 25న నిర్వహించనున్న నేషనల్ డీవార్మింగ్ డేను విజయవంతం చేసేందుకు MPDO కార్యాలయంలో మండల టాస్క్‌ఫోర్స్ సన్నాహక సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీలు, అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీపై చర్చించారు. నులిపురుగులు పిల్లల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతాయని వైద్యాధికారులు సైరా, బాలాజీ తెలిపారు.