AKP: నాతవరం మండలం గోల్లవీధిలో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద విద్యుత్ సర్వీస్‌కు సంబంధించిన జీఐ వైర్ తెగి వేలాడుతుండగా, ప్రమాదవశాత్తు తగలడంతో రొంగల జానకి (28), ఆమె తల్లి గొంప మంగ (55) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. జానకి భర్త నాగరాజు (32)కు గాయాలయ్యాయి. ఆయన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి


