హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్ధరాత్రి ఇంటి డోర్లు కొడుతున్న వ్యక్తికి దేహశుద్ధి

కృష్ణా: పెనుగంచిప్రోలు పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న మహిళల ఇంటికి డోర్లు కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని శుద్ధి చేశారు. పట్టణంలోని తూర్పు బజారున ఓ మహిళా ఇంటి డోర్లు కొడుతూ భయభ్రాంతులకు గురిచేయడంతో మహిళ స్థానికులకు సమాచారం ఇచ్చింది. ప్రజలు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.