హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు

NTR: జిల్లా వ్యాపంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచింది. ఎనికేపాడు నుంచి రామవరప్పాడు వరకు రహదారి జలమయమైంది. వాహనాల రాకపోకలతో నీరు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.