హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆకివీడు వాసులూ.. ఆ ప్రచారాలు నమ్మకండి'

W.G: ఆకివీడు నగర పంచాయతీ రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదని కమిషనర్ కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనరేట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న రిజర్వేషన్ల వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.