హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు

ప్రకాశం: దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డు తుమ్మలబైలు సమీపంలోని వీర్లకొండ వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంతో ఘాట్ రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.