హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

KDP: బద్వేల్ మండలం మడకలవారిపల్లె వద్ద జాతీయ రహదారి-67పై నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడుతో నెల్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన పట్నం భాస్కర్ (40), తలసారి రమణయ్య (50) మృతి చెందారు.