హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీల్లో నేడు ప్రత్యేకాధికారుల బాధ్యత స్వీకరణ

నంద్యాల జిల్లాలోని 28 మండల ప్రజా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ రాజకుమారి గనియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీపీల పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియడంతో నేటి నుంచి ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరు నెలలపాటు లేదా నూతన పాలకవర్గం ఏర్పడే వరకు వారు విధులు నిర్వహించనున్నారు.