హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి.