హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురువారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 67,632 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 24,909 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూ ప్రసాదం విక్రయాలు: 3.42 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన వారు: 1.76 లక్షలు, హుండీ ఆదాయం రూ.2.91 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.