హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 26న పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ఈనెల 26వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడినిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.