హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుమార్తెను షాపింగ్‌కు తీసుకెళ్తూ తండ్రి మృతి

WG: కుమార్తెను తణుకులోని షాపింగ్ మాల్ వద్ద దించడానికి బైక్‌పై వెళ్తూ తండ్రి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. అత్తిలి మండలం వరిఘేడుకు చెందిన కంతేటి సత్యనారాయణ తన కుమార్తె జ్యోతితో బయల్దేరారు. గ్రామ శివారులో వీరి బైకును ఆటో ఢీకొట్టడంతో సత్యనారాయణ మరణించగా, జ్యోతి గాయపడింది. రోజూ వెళ్లే ఆటో వర్షం వల్ల రాకపోవడంతో తండ్రే బైక్‌పై తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు.