హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు నేడు నోటిఫికేషన్

KRNL: కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల అనుమతుల పునరుద్ధరణకు దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. మొత్తం 106 మంది లైసెన్సుదారులకు గాను 93 మంది మాత్రమే అనుమతులు పునరుద్ధరించుకున్నట్లు జిల్లా ఆబ్కారీశాఖ అధికారి సుధీరాబాబు తెలిపారు. మిగిలిన 13 మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కేటాయించేందుకు నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.