హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

CTR: చిత్తూరు నగరం ఇరువారం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో రైతు ప్రెసిడెంట్ హరిబాబు చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీకొనగా, అత్యవసర చికిత్స నిమిత్తం రాణిపేట సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.