PPM: మరోసారి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా పడింది. బలిజిపేట మండలం పెదపెంకిలో రూ.6.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆయన ఇవాళ హాజరు కావాల్సి ఉండగా, తుపాను నేపథ్యంలో పర్యటనను వాయిదా వేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పేషీ నుంచి కలెక్టర్‌కు సమాచారం అందింది. తదుపరి పర్యటన తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మరోసారి డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా


