హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ పై అవగాహన సదస్సు

NLR: సీతారామపురం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షులు చిన్న కాశయ్య తెలిపారు. విద్యుత్ సరఫరా, మీటర్లు, వ్యవసాయ సమస్యలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు.