హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్

KKD: ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని గోదామును అధికారులు, గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీకి సంబంధించిన నివేదికను ECIకి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.