హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డ్స్ సాధించిన కోనసీమ పాప

కోనసీమ: పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలేనికి చెందిన మూడేళ్ల చిన్నారి యడ్లపల్లి పరిష్కృత దేవి అరుదైన ఘనత సాధించింది. కేవలం 5 నిమిషాల 9 సెకన్లలోనే 27 విభిన్న సంస్కృత శ్లోకాలను అలవోకగా పఠించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుల్లో భాగంగా బెంగళూరులో శ్లోకాలు పఠించి తన ప్రతిభను చాటింది.