హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

' 2022లోనే ఎండోమెంట్ పరిధిలోకి ఆలయం'

కోనసీమ: ద్రాక్షారామలోని ఆంజనేయస్వామి ఆలయ అంశంపై దేవాదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ బుధవారం వివరణ ఇచ్చారు. 2022లోనే ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి చేర్చినట్లు స్పష్టం చేశారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల సింగిల్ ట్రస్టీని నియమించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసమే ఎండోమెంట్ పరిధిలోకి తీసుకున్నట్లు తెలిపారు.