హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుట్టపర్తి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి'

SS: పుట్టపర్తి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్టీసీ డిపో వద్ద గల పుడా పార్కును పరిశీలించి పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్‌డీఓ సువర్ణతో కలిసి మున్సిపల్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించారు.