హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట నష్ట పరిహారం చెల్లించాలి: సీపీఎం

ATP: పుట్లూరు, బాలాపురం గ్రామాల్లో నీరు లేక ఎండిన చీనీ, అరటి పంటలను సీపీఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. వర్షభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసింది. మెట్ట పంటలకు ఎకరాకు రూ. 50 వేలు, పండ్ల తోటలకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని కోరింది. రైతుల అప్పులను వెంటనే రద్దు చేసి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసింది.