హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి'

ATP: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సంకేత భాషపై అవగాహన పెంచాలన్నారు.