హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ భూముల వేలంతో పెరిగిన ఆదాయం

KDP: ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన 27.34 ఎకరాల భూములను సాగు చేసుకునేందుకు బుధవారం వేలం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుత్త రూపంలో నిర్వహించిన వేలంలో రూ.10.62 లక్షల ఆదాయం లభించిందన్నారు. గతంలో ఇదే భూముల ద్వారా రూ.1,35,300 ఆదాయం రాగా, ఈసారి రూ.9,26,700 అధికంగా ఆదాయం సమకూరిందన్నారు.