హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

116 మద్యం దుకాణాలకే రెన్యూవల్ దరఖాస్తులు

AKP: జిల్లా పరిధిలోని మద్యం దుకాణాల రెన్యూవల్ ప్రక్రియకు మిశ్రమ స్పందన వచ్చింది. మొత్తం 155 దుకాణాలకు గానూ 116 షాపులకు మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ డీసీ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. మిగిలిన దుకాణాలకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 1 వరకు కొత్త అర్జీలు స్వీకరించి, 3న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.