VSP: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మిగిలిన పట్టాలు, కన్వేయన్స్ డీడ్ పత్రాలను గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ములగాడ తహసీల్దార్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. జీవీఎంసీ 60వ వార్డుకు చెందిన అర్హులైన 204 మందికి ఉదయం 9 గంటలకు కార్యాలయ భవనం వద్ద అందజేస్తామని పేర్కొన్నాయి. లబ్ధిదారులు గమనించి, హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఇళ్ల పత్రాలు పంపిణీ


