హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం'

KDP: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం CITU ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు చంటి, సాల్మన్ మాట్లాడుతూ.. కోవిడ్ కార్మికుల జీతాలు పెంచాలని, పనిముట్లు అందించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.