హైదరాబాద్: 28°C
వ్యాపారం

తగ్గనున్న వంట నూనెల ధరలు

వంటనూనెల ధరలకు కళ్లెం వేసేందుకు దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించింది. క్రూడ్ సోయాబీన్, క్రూడ్ పామ్ ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. రిఫైండ్ సోయాబీన్, రిఫైండ్ పామ్ ఆయిల్‌పై పన్నును 32.5% నుంచి 27.5 శాతానికి.. రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై పన్నును 32.5% నుంచి 22.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.