హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశంలో అత్యంత సంపన్నుడిగా అదానీ

దేశంలో అత్యంత సంపన్నులుగా గౌతమ్ అదానీ నిలిచారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్- 2026 ప్రకారం అదానీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు చేరింది. అలాగే ముకేశ్ అంబానీ ఆదాయం 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో అంబానీ కంటే అదానీ ఆదాయం రూ.59,400 కోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదానీ, అంబానీ తర్వాత మూడో స్థానంలో 3.39 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిత్తల్ ఉన్నారు.