VSP: భారీ వర్షం కారణంగా అగనంపూడి టోల్ గేట్ వద్ద పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో చెట్టును పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో వాహనదారులు ఉపశమనం పొందారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం


