హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస దొంగతనాలు.. ముఠా అరెస్ట్

MNCL: బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ACP కిరణ్ కుమార్ తెలిపారు. తాండూర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం మాట్లాడుతూ.. నిందితుల వద్ద రూ.50,000 నగదు, 2 బైక్‌లు, 10 కిలోల కాపర్ వైర్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్ట్‌లో హాజరు పరిచామన్నారు.